: విజయవాడలో అదృశ్యమైన ఐఏఎస్ అధికారి చెల్లెలు... మాజీ ఎమ్మెల్యే జయరాజ్ కుమారుడి హస్తం!


విజయవాడలో ఐఏఎస్ అధికారి చెల్లెలు, వైద్య వృత్తిలో కొనసాగుతున్న సూర్యకుమారి అనే యువతి అదృశ్యం ఇప్పుడు సంచలనమైంది. మాజీ ఎమ్మెల్యే జయరాజ్ కుమారుడు విద్యాసాగర్ హస్తమున్నట్టు తెలుస్తోంది. అందుబాటులోని మరింత సమాచారం మేరకు, కర్ణాటక క్యాడర్ కలెక్టరుగా పనిచేస్తున్న అధికారి సోదరి సూర్యకుమారి విద్యాసాగర్ ను ప్రేమించింది. విద్యాసాగర్ కు ఇప్పటికే వివాహం కాగా, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

రెండు రోజుల నాడు విద్యాసాగర్ ఇంటికి వెళ్లిన సూర్యకుమారి ఆపై కనిపించలేదు. ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. సూర్య కుమారి తమ ఇంటికి వచ్చిందని, ఆపై వెంటనే వెళ్లిపోయిందని విద్యాసాగర్ తల్లి చెబుతున్నారు. పోలీసులు ఆ ఇంట్లోని సీసీటీవీ ఫుటేజ్ ని స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఓ కలెక్టర్, ఓ మాజీ ఎమ్మెల్యేల కుటుంబాల మధ్య కేసు కావడంతో పోలీసులు రహస్యంగా విచారిస్తున్నట్టు తెలుస్తోంది. సూర్య కుమారి కుటుంబసభ్యులు మాత్రం విద్యాసాగర్ పైనే ఫిర్యాదు చేశారు.

  • Loading...

More Telugu News