: డోక్లామ్ నుంచి పారిపోయిన ఇండియా: చైనా సంచలన వ్యాఖ్య


డోక్లామ్ ప్రాంతంలో మోహరించిన సైన్యంలో అత్యధిక భాగాన్ని భారత్ ఉపసంహరించుకున్నదని, ఇది తమకు లభించిన విజయమని చైనా వ్యాఖ్యానించింది. నెల రోజుల క్రితం సుమారు 400 మంది వరకూ ఈ ప్రాంతలో ఉండగా, ఇప్పుడు వారి సంఖ్య 40 మాత్రమేనని చైనా వెల్లడించగా, భారత్ దాన్ని ఖండించింది. డోక్లామ్ నుంచి సైన్యాన్ని ఉపసంహరించినట్టు వచ్చిన వార్తలు అవాస్తవమని స్పష్టం చేసింది.

కాగా, బుధవారం నాడు చైనా 15 పేజీల స్టేట్ మెంట్ ను విడుదల చేస్తూ, మ్యాప్స్, ఫొటోగ్రాఫ్ తదితరాలతో డోక్లామ్ లో ఉన్న వాస్తవ పరిస్థితి ఇదేనంటూ పేర్కొంది. సిక్కిం, భూటాన్, టిబెట్ ట్రై జంక్షన్ ప్రాంతం తమదేనని మరోసారి తేలిపోయిందని వ్యాఖ్యానించింది. భారత్ వెనక్కు తగ్గడంతో 45 రోజుల పాటు కొనసాగిన ఉద్రిక్తతలు తగ్గాయని తెలిపింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ బీజింగ్ కు వెళ్లి, చైనా జాతీయ సలహాదారు యాంగ్ జీచీని కలిసి చర్చలు జరిపిన అనంతరం, ఈ ప్రకటన వెలువడటం గమనార్హం.

  • Loading...

More Telugu News