: 25వ జేమ్స్ బాండ్ చిత్రం టైటిల్ ఇదేనట!


జేమ్స్ బాండ్ చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ఆదరణను చూరగొన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. బాండ్ సిరీస్ లో ప్రస్తుతం 25వ చిత్రం తయారవుతుండగా, డేనియల్ క్రెయిగ్ దీనిలో హీరోగా మరోసారి కనిపించనున్నాడు. 2019 నవంబర్ లో విడుదల కానున్న చిత్రానికి ఇంతవరకూ 'షట్టర్ హ్యాండ్' అనే వర్కింగ్ టైటిల్ ను పెట్టగా, 'ఇండిపెండెంట్ డాట్ కో డాట్ యూకే' కథనం ప్రకారం క్రొయేషియాలో అత్యధిక భాగం షూట్ చేస్తున్న చిత్రాన్ని రేమాండ్ మెన్సన్ రచించిన 'నెవర్ డ్రీమ్ ఆఫ్ డయ్యింగ్' అనే నవల ఆధారంగా రూపొందిస్తున్నారు.  

ఇక, ఈ పుస్తకం కథాంశం ప్రకారం, బాండ్ ఈ చిత్రంలో టైలిన్ మిగ్నోనీ అనే ఫిల్మ్ స్టార్ తో సంబంధం నడుపుతూ ఉంటాడు. ఆమె భర్తకు ఓ క్రైమ్ ఆర్గనైజేషన్ తో సంబంధాలుంటే, వాటినెలా బాండ్ బయటపెడతాడన్న అంశాలుంటాయి. ఇందులో విలన్ అంధుడు కావడం గమనార్హం.

  • Loading...

More Telugu News