: చికెన్ చీపైనప్పుడు టమాటా ఎందుకు?... వినూత్న ప్రచారంతో ఆకట్టుకుంటున్న వ్యాపారి!


కూరగాయల ధరలు కొండెక్కి కూర్చుని కిందికి దిగిరానంటున్నాయి. ఇంతలోనే శ్రావణ మాసం వచ్చేసింది. దీంతో వ్రతాలు, పూజలు సాధారణం. ఈ నేపథ్యంలో మాంసాహారానికి విరామం ప్రకటించక తప్పని పరిస్థితి. దీంతో వరంగల్ లోని రంగశాయిపేట అండర్ బ్రిడ్జి ప్రాంతంలోని ఒక చికెన్ వ్యాపారి అద్భుతమైన ప్రచారంతో ఆకట్టుకుంటున్నాడు.

తన షాపు ముందు కోడి బెలూన్ ఏర్పాటు చేశాడు. దాని మెడలో ఒక పెద్ద స్లోగన్ బోర్డు ఏర్పాటు చేశాడు. అందులో టమాటాలు ఒకవైపు.. మరోవైపు చికెన్‌ బొమ్మలు వేసి... రెండింటి ధరలు పేర్కొన్నాడు. కేజీ టమాటా 100 రూపాయల నుంచి నెమ్మదిగా కిందికి దిగుతూ, 60 రూపాయల దగ్గర ఆగింది. కేజీ టమోటా కొన్న ధరకే అరకేజీ చికెన్ వస్తోందని అతను చేస్తున్న ప్రచారం స్థానికులను విశేషంగా ఆకట్టుకుంటోంది. 

  • Loading...

More Telugu News