: అమ్మాయిలే ఉగ్రవాదులను పట్టిస్తున్నారా?
ఉగ్రవాదులు కశ్మీర్ లోని యువతులతో సంబంధాలు పెట్టుకోవడం తమకు కలిసి వస్తోందని భద్రతా బలగాలు పేర్కొంటున్నాయి. ఈ మధ్య కాలంలో ఎన్ కౌంటర్ లో హతమైన ఉగ్రవాదులు బుర్హాన్ వనీ, అబూ తల్హా, అబ్దులా యుని, ఇప్పుడు తాజాగా అబు దుజానా వీరంతా ఏదో రకంగా కశ్మీర్ అమ్మాయిలతో సంబంధాలు నెరిపేందుకు ఉత్సాహం చూపినవారే. జీహాద్ (పవిత్ర యుద్ధం) కోసం అన్నీ వదిలేశామని, త్యాగాలతో అల్లా కోసం పోరాడుతున్నామని చెప్పుకునే ఉగ్రవాదులు, వివిధ ప్రాంతాలకు తిరుగుతూ దాడులు చేస్తుంటారు.
అయితే వీరు వివాహం రూపంలో కానీ, ఇతర పద్ధతుల్లో కానీ అమ్మాయిలతో బంధాలు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రాంతాలకు చెందిన యువతులను వివాహం పేరుతో వంచించడం, లొంగదీసుకోవడం వంటి చర్యల ద్వారా సంబంధాలు నెరపుతున్నారు. దీంతో సదరు మహిళలే ఉగ్రవాదులకు చెందిన సమాచారాన్ని తమకు అందిస్తున్నారని భద్రతా బలగాలకు చెందిన ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. అబూ దుజానా కూడా ఇలాగే హతమయ్యాడని ఆయన పేర్కొన్నారు.