: 'హైడ్రోజన్ పబ్'పై దాడి... హైదరాబాదీ యువకులు, ముంబై యువతుల అరెస్టు
హైదరాబాదు, జూబ్లీహిల్స్ రోడ్ నెం.2లోని షాంగ్రిల్లా ప్లాజాలో ఆఖరి అంతస్తులో ఉన్న హైడ్రోజన్ పబ్ పై వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో ముజ్రా పార్టీ చేసుకుంటున్న హైదరాబాదీ యువకులతో పాటు, ముంబై యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెద్ద ఎత్తున విదేశీ మద్యం, గంజాయి, ఖరీదైన సిగరెట్లు, కొంత డ్రగ్స్ తో రాత్రంతా ముజ్రా పార్టీ నిర్వహించేందుకు 68 మంది యువతీ యువకులు 3 లక్షల రూపాయల అద్దె చెల్లించారు. రాత్రంతా జరిగే ఈ పార్టీలో మందు, విందు, చిందు నిర్వహించేందుకు పకడ్బందీ ప్లాన్ వేశారు. ఈ నేపథ్యంలో పబ్ లో పెద్ద పార్టీ నడుస్తోందని టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది.
దీంతో పార్టీలో పాల్గొనేందుకు ఒక్కొక్కరు చేరుకుంటుండగా, టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. అప్పటికి జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలి, బేగంపేట్, పాతబస్తీ ప్రాంతాలకు చెందిన సంపన్న వర్గాలకు చెందిన 11 మంది యువకులు. ముంబైకి చెందిన ఏడుగురు యువతులు ఉన్నారని, వారిలో ఒకరు హిజ్రా అని పోలీసులు చెప్పారు. పోలీసులు వెళ్లే సరికి వీరంతా నగ్నంగా డాన్సులు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో హైడ్రోజన్ పబ్ మేనేజర్ పద్మనాభంను అదుపులోకి తీసుకున్నారు. వీరందరినీ నేడు కోర్టులో హాజరుపరచనున్నారు.