: నన్ను పట్టుకున్నందుకు అభినందనలు.. కానీ నేను లొంగే ప్రసక్తే లేదు..: ఆర్మీతో ఉగ్రవాది దుజానా సంభాషణ వైరల్!


భారత భద్రతా దళాల చేతిలో హతమైన లష్కరే తోయిబా (ఎల్ఈటీ) కమాండర్ అబు దుజానా ఆర్మీ అధికారితో చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి. తనను పట్టుకున్నందుకు కంగ్రాట్స్ చెబుతూనే.. లొంగే ప్రసక్తి మాత్రం లేదని పేర్కొన్నాడు. మంగళవారం పుల్వామాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో దుజానా హతమయ్యాడు. అంతకుముందు ఓ అధికారి దుజానాతో ఫోన్లో మాట్లాడాల్సిందిగా ఓ మహిళను పురమాయించారు. ఆమె కాసేపు మాట్లాడిన తర్వాత ఫోన్‌ను అధికారికి ఇచ్చాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య సంభాషణ ఇలా సాగింది.. ‘‘క్యా హాల్ హై? మైనే కహా, క్యా హాల్ హై?(ఎలా ఉన్నావ్? ఎలా ఉన్నావని అడుగుతున్నా?)’’ అని అధికారి దుజానాను ప్రశ్నించారు. హుమారా హాల్ చోర్ దుజానా. వై డోంటు యు సరెండర్? (నువ్వీ అమ్మాయిని పెళ్లాడావు, నువ్వు చేస్తున్నది తప్పు)’’ అని అధికారి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

దానికి దుజానా స్పందిస్తూ.. ‘‘హమ్ నిక్లీ థీ షాహీద్ హో. మై క్యా కరూ, జిస్కో గేమ్ ఖేల్నా హై. ఖేలో.. కభీ హమ్ ఆగే, కభీ ఆప్, ఆజ్ అప్ నే పకడ్ లియే, ముబారక్ హో ఆపకో. జిస్కో జో కర్నా హై కర్లో (నేను అమరుడయ్యేందుకే వచ్చా. నేనేం చేయగలను. ఈ ఆటలో కొన్ని సార్లు మీరు ముందుంటారు, కొన్ని సార్లు మేం. ఈసారి మాత్రం మీరే. నన్ను పట్టుకున్నందుకు శుభాకాంక్షలు. ఇప్పుడేం చేస్తారో చేసుకోండి’’ అని చెబుతూనే ‘‘నేనైతే లొంగిపోయే ప్రసక్తే లేదు. నా అదృష్టం ఎలా ఉంటే అల్లా అలానే చేస్తాడు. సరేనా?’’ అని అధికారికి తేల్చి చెప్పాడు.

దుజానాను లొంగిపోమని చెప్పేందుకు అధికారి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. కశ్మీరీ యువతను ఉగ్రవాదంలో చేర్చుకుని వారి భవిష్యత్తును నాశనం చేయవద్దని కోరుతుండగా దుజానా ఫోన్ కట్ చేశాడు. ఆ తర్వాత అతడిని భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఇప్పుడీ ఆడియో టేప్ బయటపడి సంచలనం సృష్టిస్తోంది.

  • Loading...

More Telugu News