: మీరు కన్యా? కాదా?... వివాదాస్పదమవుతున్న ఉద్యోగ దరఖాస్తు కాలమ్!
ఇందిరాగాంధీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఐజీఐఎంఎస్) లో ఉద్యోగంలో చేరేందుకు చేసే దరఖాస్తులో ఒక కాలమ్ వివాదం రేపుతోంది. బీహార్ రాజధాని పట్నాలోని షేక్ పురాలో గల ఐజీఐఎంఎస్ లో ఉద్యోగావకాశ ప్రకటన వెలువడింది. దీని దరఖాస్తు ఫారంలో 'వివాహ స్థితి' అనే కాలమ్ లో ‘నేను బ్రహ్మచారి/వితంతువు/కన్య’ అని ఉంది.
అలాగే ‘నాకు ప్రస్తుతం జీవించి ఉన్న ఒకే భార్య ఉంది’, ‘నాకు పెళ్లైంది, ఒకరి కన్నా ఎక్కువ మంది భార్యలు ఉన్నారు’ అనే మరో కాలం కూడా ఉంది, ఇక మహిళలైతే ‘నేను పెళ్లి చేసుకున్న అతనికి జీవించి ఉన్న మరో భార్య లేదు’, ‘నేను పెళ్లి చేసుకున్న అతనికి జీవించి ఉన్న మరో భార్య కూడా ఉంది’ లాంటి వింత ఆప్షన్లతో కూడిన కాలమ్ లు ఉన్నాయి. ఈ ఆప్షన్లే వివాదాస్పదంగా ఉంటే... ఈ ఆసుపత్రి సూపరిండెంట్ మాట్లాడుతూ, ఉద్యోగులపై అత్యాచారం జరిగినప్పుడు దరఖాస్తు ద్వారా ఇప్పుడిచ్చే సమాచారం ఉపయోగపడుతుందని అన్నారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.