: ఆ మొగాడు చేసిన పని వల్లే సీట్ల సంఖ్య పెరగట్లేదు: కేసీఆర్


నియోజకవర్గాల సంఖ్య పెంపుపై తమకు ఎలాంటి ఆసక్తి లేదని, అవి పెరిగినా, పెరగకపోయినా ఒకటేనని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ‘చిన్నరాష్ట్రాల్లో రాజకీయ అస్థిరత ఎక్కువగా వచ్చే ఆస్కారం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని అప్పుడు చట్టం చేసినప్పుడు ఏం చేశారంటే .. కొన్ని సీట్లు పెంచితే సుస్థిరంగా ఉంటుందని భావించారు. ఈ రోజు సీట్ల సంఖ్య పెరగకపోవడానికి ప్రధాన కారణం జైరామ్ రమేశ్ యొక్క అజ్ఞానం. నాడు డ్రాఫ్ట్ రాసింది ఈ మొగాడే... ‘నాట్ విత్ స్టాండింగ్ 170’ కు బదులు ‘విత్ స్టాండింగ్ 170’ అని జైరామ్ రమేశ్ రాశాడు. ఇప్పుడు, సీట్ల సంఖ్య పెంచాలంటే..కచ్చితంగా రాజ్యాంగ సవరణ చేయాలని కేంద్రం అంటోంది. ప్రధానమంత్రిని ఇటీవల కలిసినప్పుడు చెప్పాను.. సీట్ల సంఖ్య పెంచుతామంటే పెంచండి, లేకపోతే లేదని చెప్పండి. అంతేకానీ, ముసుగులో గుద్దులాట మంచిదికాదని చెప్పాను ... మొన్న ప్రధానమంత్రి గారు నాతో మాట్లాడిన దాన్ని బట్టి సీట్ల సంఖ్య పెంచడం లేదని నాకు అర్థమైంది. బహుశ సీట్ల సంఖ్య పెంచకపోవచ్చనే నేనూ భావిస్తున్నాను’ అని కేసీఆర్ చెప్పారు. 

  • Loading...

More Telugu News