: ముఖ్యమంత్రి జల్సాలు చేయదలచుకుంటే సిటీలో గెస్ట్ హౌస్ లు లేవా?: కేసీఆర్
తాను తన ఫామ్ హౌస్ కు వెళితే జల్సాల కోసం అంటూ విమర్శిస్తున్నారని, ముఖ్యమంత్రి జల్సాలు చేయదలచుకుంటే సిటీలో గెస్ట్ హౌస్ లు లేవా? అంటూ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘జోకర్లు, బ్రోకర్లా నా గురించి మాట్లాడేది? ఫామ్ హౌస్ కు వెళితే జల్సాల కోసం వెళ్లాడనే వాడు నాయకుడా? ముఖ్యమంత్రి జల్సాలు చేయాలనుకుంటే హైదరాబాద్ లో ఎన్ని గెస్ట్ హౌస్ లు లేవు?.. ఇలా మాట్లాడేవాడు నాయకుడా? వాళ్లు మాట్లాడే మాటలు పేపర్లలో రాస్తారా? ఇది మన రాష్ట్ర సంస్కారమా?... త్యాగాలతో తెలంగాణను సాధించుకుంటే..ఇలాంటి రాజకీయాలు చేస్తారా?’ అంటూ కేసీఆర్ మండిపడ్డారు.