: సీఎం కావాలనే ఆలోచన నాకు లేదు.. మంత్రి పదవే చాలా ఎక్కువ!: నారా లోకేశ్


తనకు సీఎం కావాలనే ఆలోచన లేదని ఏపీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘నాకు అటువంటి ఆలోచనే లేదు. నేను ప్రజలకు సేవ చెయ్యాలి. నాకు మంత్రి పదవే చాలా ఎక్కువ. దీనికే, నేను న్యాయం చెయ్యాలి’ అని చెప్పుకొచ్చారు.

వైసీపీ ప్లీనరీలో ఇటీవల ఇచ్చిన హామీల గురించి ప్రస్తావించగా, ‘ఈ హామీలను 2014లోనే టీడీపీ అమలు చేసేసింది. అదే మ్యానిఫెస్టో ను వైసీపీ కాపీ చేసి.. అంకెలు మార్చేసి ‘నవరత్నాలు’ అంటే ఎవ్వరూ నమ్మరు. మేము చేసినవే వాళ్లు కాపీ కొడుతున్నారు. త్వరలోనే ‘అన్న’ క్యాంటీన్లు కూడా పూర్తి చేస్తాం. నిరుద్యోగ భృతి కూడా ఈ ఏడాదిలోనే అయిపోతుంది. గతంలో మేము ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటాం, అందులో ఎటువంటి సందేహమూ లేదు’ అని అన్నారు.

  • Loading...

More Telugu News