: ఈ క్షణంలో ఎన్నికలు పెట్టినా టీడీపీకి 140 స్థానాలు వస్తాయి: నారా లోకేశ్


ఏపీలో ఈ క్షణంలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించినా టీడీపీకి 140 స్థానాలు వస్తాయని ఏపీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, అవినీతికి పాల్పడే ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు తప్పవని అన్నారు. ఒకరిద్దరు చేసిన తప్పులను అందరికీ ఆపాదించలేమని అన్నారు. వైసీపీ నుంచి తమ పార్టీలోకి వచ్చిన నాయకులందరికీ సీట్ల సర్దుబాటు చేస్తామని అన్నారు. నియోజకవర్గాల పునర్విభజన జరగదని ఎవరు చెప్పారు? అని, రాజ్యాంగ సవరణ మాత్రమే చేయాలని చెప్పారని లోకేశ్ అన్నారు.

  • Loading...

More Telugu News