: పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రస్తావించిన నారా లోకేశ్


ప్రముఖ హీరోలు పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ గురించి ఏపీ మంత్రి నారా లోకేశ్ ప్రస్తావించారు. అమరావతిలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, జూనియర్ ఎన్టీఆర్ తో తమకు ఎటువంటి విభేదాలు లేవని, పార్టీ కోసం పని చేసేందుకు ఎవరు వచ్చినా ఆహ్వానిస్తామని చెప్పారు. అదే విధంగా, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తో సత్సంబంధాలు ఉన్నాయని అన్నారు. 2019 నాటికి పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణం పూర్తి అవుతాయని చెప్పిన లోకేశ్, తమ ఉనికి కోసమే బీజేపీతో కలుస్తామంటూ వైసీపీ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని అన్నారు. బీజేపీతో తమకు ఎటువంటి విభేదాలు లేవని లోకేశ్ చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News