: పూరీ జగన్నాథ్ ఎటువంటి మచ్చ లేకుండా బయటకొస్తారు: దర్శకుడు కృష్ణ వంశీ
డ్రగ్స్ వ్యవహారంలో సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ పై ఆరోపణలు తలెత్తడం, నోటీసులు అందుకోవడం .. ఆపై సిట్ అధికారులు విచారణ చేపట్టడం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ స్పందిస్తూ.. పూరీ జగన్నాథ్ వ్యక్తిత్వమేమిటో తనకు బాగా తెలుసని, దిగజారే మనిషి కాదని అన్నారు. ఈ వ్యవహారం నుంచి పూరీ ఎటువంటి మచ్చ లేకుండా బయటకు వస్తారని కృష్ణవంశీ విశ్వాసం వ్యక్తం చేశారు. సామాజిక అంశాలతో కూడిన, సమాజాన్ని మేల్కొలిపే ఎన్నో గొప్ప చిత్రాలను ఆయన తీశాడని కృష్ణవంశీ అన్నారు.