: భక్తిరస పాటల రియాలిటీ షో న్యాయనిర్ణేతగా రామ్‌దేవ్ బాబా?
యోగా గురువు రామ్‌దేవ్ బాబా త్వరలో ఓ రియాలిటీ షోకు పూర్తిస్థాయి న్యాయనిర్ణేతగా వ్యవహరించనున్నారు. గతంలో `నచ్ బలియే`, `ఇండియాస్ బెస్ట్ డ్రామాబేజ్` రియాలిటీ షోలకు గెస్ట్ జడ్జిగా ఆయన వెళ్లారు. ఇప్పుడు భక్తిరస పాటలను, భజనలను కొత్త తరహాలో వినిపించే `ఓం శాంతి ఓం` అనే రియాలిటీ షోకు ఆయన జడ్జిగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా, గాయని కనికా కపూర్, సంగీత దర్శకుడు శేఖర్ రావ్‌జియానీ ఈ రియాలిటీ షోకి న్యాయనిర్ణేతలుగా వ్యవహరించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన మొదటి ఎపిసోడ్ షూటింగ్ ఇటీవలే పూర్తయినట్లు సమాచారం. భారతదేశంలో ఇలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్న మొదటి రియాలిటీ షో అని టీవీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.