: ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన ఇండిగో
తన 11వ వార్షికోత్సవం సందర్భంగా ప్రయాణికులకు ఇండిగో ఎయిర్ లైన్స్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. రూ. 1111 ప్రారంభ ధరతో టికెట్లను విక్రయిస్తామంటూ ఆఫర్ ఇచ్చింది. ఈ ఆఫర్ కింద ఈ రోజు నుంచి ఆగస్ట్ 6వ తేదీ వరకు టికెట్లు అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. దీని ద్వారా ఆగస్టు 21 నుంచి వచ్చే ఏడాది మార్చి 24 వరకు ప్రయాణ టికెట్లను బుక్ చేసుకోవచ్చని తెలిపింది. మన దేశంలోని 45 ప్రాంతాలకు ఈ ఆఫర్ ను వర్తింపజేస్తున్నట్టు ప్రకటించింది.
ఇండిగో ఆఫర్ చేసిన సిటీల్లో ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం, జైపూర్, ఇండోర్, ఇంఫాల్, గౌహతి, డెహ్రాడూన్, కోయంబత్తూరు, ఛండీగఢ్, భువనేశ్వర్, అమృత్ సర్, అగర్తలా, పాట్నా, నాగపూర్, మంగళూరు, మధురై, లక్నో, కోల్ కతా, కోచి, ఇండోర్, జైపూర్, జమ్ము, రాంచీ, శ్రీనగర్, తిరువనంతపురం, వడోదర, ఉదయ్ పూర్, వారణాసి తదితర నగరాలు ఉన్నాయి. వీటికి తోడు సింగపూర్, షార్జా, దుబాయ్, దోహా, మస్కట్ తదితర విదేశీ నగరాలు కూడా ఉన్నాయి. అయితే, నాన్ స్టాప్ విమానాలకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందనే షరతును విధించింది.