: చంద్రబాబును వెంటనే అరెస్ట్ చేయాలి: తమ్మినేని సీతారాం


ఒక్కో ఓటును రూ. 5వేలు ఇచ్చి కొనుగోలు చేయగలనంటూ వ్యాఖ్యానించిన ముఖ్యమంత్రి చంద్రబాబును వెంటనే అరెస్ట్ చేయాలని వైసీపీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం అన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుని, ఆయనపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ కేబినెట్ మొత్తం జోకర్స్ డెన్ గా మారిందని ఎద్దేవా చేశారు.

అసెంబ్లీ సీట్ల పెంపు 2026 వరకు సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పడంతో... టీడీపీలో వణుకు పుట్టిందని తమ్మినేని అన్నారు. అసెంబ్లీ సీట్ల పెంపు కోసం రాష్ట్ర ప్రయోజనాలను చంద్రబాబు తాకట్టు పెట్టారని విమర్శించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సీట్లు పెరుగుతాయంటూ స్వీట్లు తినిపించారని ఎద్దేవా చేశారు. ఫిరాయింపుదార్లు ఇప్పటికైనా వాస్తవాలను గ్రహించాలని, చంద్రబాబును నిలదీయాలని అన్నారు.

  • Loading...

More Telugu News