: అందుకే, నేను మళ్లీ ప్రేమకథా చిత్రంలోనే నటిస్తున్నాను: హీరో వరుణ్ తేజ్


శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కి, మంచి వసూళ్లు రాబడుతున్న ప్రేమకథా చిత్రం ‘ఫిదా’. ఈ సినిమా తర్వాత వరుణ్ తేజ్ మళ్లీ ప్రేమకథా చిత్రంలోనే నటిస్తున్నాడు. ఈ విషయమై తాజా ఇంటర్వ్యూలో వరుణ్ తేజ్ మాట్లాడుతూ, ‘ఫిదా’ తర్వాత తాను మళ్లీ  ప్రేమకథా చిత్రంలోనే నటిస్తుండటంతో చాలామంది ఆశ్చర్యపోతున్నారని అన్నాడు. అయితే, వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కనున్నఈ చిత్రంలో ప్రేమకథ చాలా విభిన్నంగా ఉందని, అందుకే, ఈ సినిమాలో నటించేందుకు తాను ఒప్పుకున్నానని చెప్పారు. ఈ సందర్భంగా ‘ఫిదా’ గురించి వరుణ్ ప్రస్తావిస్తూ, శేఖర్ కమ్ముల తనదైన శైలిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించడం వల్లే ఈ సినిమా నిలదొక్కుకుందని చెప్పాడు.

  • Loading...

More Telugu News