: ఎస్సార్ స్టీల్ దివాలా... పిటిషన్ ను స్వీకరించిన ఎన్సీఎల్టీ
ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకుల నుంచి రుణాలను తీసుకుని వాటిని తిరిగి చెల్లించడంలో విఫలమైన ఎస్సార్ స్టీల్, దివాలా పిటిషన్ ను దాఖలు చేయగా, నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ) అహ్మదాబాద్ బెంచ్ దాన్ని స్వీకరించింది. దివాలా చట్టం 2016 నిబంధనల ప్రకారం, ఆ కంపెనీపై బ్యాంకులు చర్యలకు ఉపక్రమించరాదని ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ విక్కీ రవీంద్ర నేతృత్వంలోని ట్రైబ్యునల్ బెంచ్, ఎస్సార్ స్టీల్ లో సమస్యలను పరిష్కరించి, రుణాలను పునర్వ్యవస్థీకరించేందుకు ఐఆర్పీ (ఇన్ టీరియమ్ రెజల్యూషన్ ప్రొఫెషన్స్)ను నియమించింది. తమకు మొత్తం రూ. 34 కోట్లు రావాల్సి వుందని, వాటిని వసూలు చేసుకునేందుకు సహకరించాలని రెండు బ్యాంకులూ ట్రైబ్యునల్ ముందు పిటిషన్లు దాఖలు చేశాయి.