: తమిళ రాజకీయాల్లో ఊహించని పరిణామం.... ప్రభుత్వంలో భాగస్వామి కానున్న ఎన్డీయే!


తమిళనాడు రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంటున్నట్టు తెలుస్తోంది. తమిళనాడులో పాగావేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న బీజేపీ యత్నాలు సత్ఫలితాలు ఇచ్చినట్టు సమాచారం. తమిళనాట అన్నాడీఏంకే ప్రభుత్వంలో బీజేపే సారధ్యంలోని ఎన్డీఏ భాగస్వామ్యం కానున్నట్టు సమాచారం. పన్నీరు సెల్వం, పళనిస్వామి ఇద్దరూ ఎన్డీయేలో భాగస్వాములు కానున్నారు. ముఖ్యమంత్రి మార్పు లేనప్పటికీ కేబినెట్ లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

పన్నీరు సెల్వంను రాజ్యసభకు పంపనున్నట్టు తెలుస్తోంది. అలాగే అన్నాడీఎంకేకు మూడు కేంద్ర మంత్రి పదవులు ఇవ్వనున్నట్టు కూడా సమాచారం. ఉత్తరాదిన తిరుగులేని బీజేపీకి కర్ణాటక మినహా దక్షిణాది రాష్ట్రాల్లో ఏమాత్రం పట్టులేదు. దక్షిణాదిన పట్టుపెంచుకోవాలని తీవ్ర ప్రయత్నాల్లో ఉన్న బీజేపీ దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం అనంతరం జాగ్రత్తగా పావులు కదుపుతూ లక్ష్యాన్ని సాధించింది. అయితే బీజేపీ వ్యూహాలు తమిళనాట ఏ మేరకు విజయవంతమవుతాయో కాలమే చెప్పాలి!  

  • Loading...

More Telugu News