: కష్టాలలో వున్న కళాకారుడిని ఆదుకుని.. గొప్ప మనసును చాటుకున్న పోసాని!
తెలుగు సినీ పరిశ్రమలో పోసాని కృష్ణమురళిది ఓ విభిన్నమైన మనస్తత్వం. ఏ విషయంపైనైనా లోపల ఒకటి పెట్టుకుని, బయటకు మరొకటి మాట్లాడటం ఆయనకు చేతకాదు. కుండబద్దలు కొట్టినట్టే తన మనసులోని మాటను ఆయన వెల్లడిస్తారు. ఆయనలోని మరో కోణం ఏమిటంటే, కష్టాల్లో ఉన్నవారికి చేతనైనంత సాయం చేయడం. కష్టాల్లో ఉన్న వారు ఎదురైతే ఆయన చలించిపోతారు.
తాజాగా, ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న కిన్నెర కళాకారుడు దర్శనం మొగులయ్యకు ఆయన రూ. 25 వేల ఆర్థిక సాయం అందించారు. అంతేకాదు, భవిష్యత్తులో కూడా తిండికి, బట్టకు ఏ లోటు వచ్చినా, తాను ఆదుకుంటానని చెప్పారు. మొగులయ్య గురించి ఓ టీవీ ఛానల్ లో ప్రసారమైన కథనం ద్వారా తెలుసుకున్న ఆయన... సదరు ఛానల్ ద్వారా మొగులయ్య వివరాలను తెలుసుకున్నారు. అనంతరం ఆయనకు ఆర్థిక సాయం అందించారు.