: మూడు రోజులు ట్రై చేసినా బోయపాటి శ్రీను చెప్పినట్టు చేయలేకపోయిన జగపతిబాబు... లాభం లేదని వదిలేసిన డైరెక్టర్!


హీరోగా కెరీర్ ను ప్రారంభించి, ఇప్పుడు విలన్ గా, క్యారెక్టర్ నటుడిగా రాణిస్తున్న జగపతిబాబు నటనా సామర్థ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికే ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న జగపతిబాబు, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన 'జయ జానకీ నాయక' చిత్రం షూటింగ్ లో తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకున్నాడు. ఈ సినిమాలో ఆయన విలన్ గా నటిస్తుండగా, ఓ సీన్ లో బోయపాటికి కావాల్సిన ఎక్స్ ప్రెషన్ ను ఇవ్వలేకపోయాడట. దాదాపు మూడు రోజుల పాటు ఆ సీన్ సరిగ్గా రావాలని కృషి చేసి, 20 టేకులు చేసినా, అనుకున్నట్టు ఆ సీన్ రాలేదని జగపతిబాబు స్వయంగా వెల్లడించాడు. ఇక లాభం లేదనుకుని ఎడిటింగ్, డబ్బింగ్ సమయంలో ఆ సీన్ ను ఎడ్జస్ట్ చేశామని చెప్పాడు. ఇక అది ఏం సీన్ అన్న విషయమై సస్పెన్స్ ను కొనసాగిస్తూ, సినిమా విజయోత్సవ సభలో ఆ సీన్ గురించి చెబుతానని అన్నాడు జగ్గూభాయ్.

  • Loading...

More Telugu News