: డోపింగ్ కు పాల్పడడం కంటే నీచం మరొకటి లేదు: ఉసేన్ బోల్ట్


డోపింగ్ కు పాల్పడుతున్న అథ్లెట్లపై పరుగు వీరుడు, జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ మండిపడ్డాడు. డోపింగ్ కు పాల్పడటమంటే ఆ క్రీడను చేతులారా నాశనం చేయడమేనని చెప్పాడు. ఇంతకంటే నీచమైన పని మరొకటి ఉండదని, డోపింగ్ ను పూర్తిగా అంతం చేయాల్సిన అవసరం ఉందని తెలిపాడు. డోపింగ్ ను నిరోధిస్తేనే, క్రీడలకు మేలు చేసినవారమవుతామని చెప్పాడు. ఈ విషయాన్ని అథ్లెట్లు అర్థం చేసుకోవాలని విన్నవించాడు.

ఉత్ప్రేరకాలను వాడి మోసం చేసేవారు... ఏదో ఒక రోజు పట్టుబడక తప్పదనే విషయాన్ని గ్రహించాలని చెప్పాడు. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో పాల్గొనడానికి వచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ బోల్ట్ ఈ వ్యాఖ్యలు చేశాడు. లండన్ లో శుక్రవారం నుంచి ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ జరగనుంది. ఇందులో 100 మీటర్లు, 4X100 మీటర్ల రేసులో బోల్ట్ పాల్గొనబోతున్నాడు. ఈ ఛాంపియన్ షిప్ తర్వాత అతను తన కెరీర్ కు గుడ్ బై చెప్పనున్నాడు.  

  • Loading...

More Telugu News