: ఆమిర్ ఖాన్ `సీక్రెట్ సూపర్‌స్టార్` పోస్టర్ విడుదల
విలక్షణ నటుడు ఆమిర్ ఖాన్ తన సొంత బ్యానర్‌లో నిర్మిస్తున్న `సీక్రెట్ సూపర్‌స్టార్` సినిమా పోస్టర్‌ను తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా విడుదల చేశాడు. ఈరోజు సాయంత్రం 6:30 గం.లకు సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు ఆమిర్ ట్వీట్‌లో పేర్కొన్నాడు. జూలై 31న ఆయన ఈ సినిమాకు సంబంధించి మొదటి పోస్టర్ విడుదల చేశారు. ఆ పోస్టర్ చూసి `తారే జమీన్ పర్` లాంటి సినిమా రాబోతుందని అభిమానులు ఆశించారు. ఈ రెండో పోస్టర్‌లో `దంగల్`లో ఆమిర్‌తో పాటు నటించిన జైరా వసీం పాఠశాల దుస్తుల్లో గిటార్ వాయిస్తున్నట్లు ఉంది. వెనకాల ఆమిర్ రాక్‌స్టార్ అవతారంలో కనిపిస్తున్నారు.
ఈ చిత్రంలో మారుమూల గ్రామానికి చెందిన ముస్లిం విద్యార్థిని సంగీతంపై ఆసక్తితో తండ్రికి తెలియకుండా యూట్యూబ్‌లో వీడియోలు పెడుతుంది. వాటి వల్ల ఆమెకు వచ్చిన సమస్యలు, పెద్ద గాయని అవ్వాలనుకున్న తన ఆశయాన్ని చేరుకోవడం వంటి అంశాల నేపథ్యంగా ఈ సినిమా తెరకెక్కింది. `తారే జమీన్ పర్` సినిమాతో చిన్నపిల్లలతో ఆమిర్ నటన ఎంత బాగుంటుందో తెలిసింది. ఈ సినిమాతో కూడా అలాంటి మేజిక్ చేస్తాడని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.