: సుకుమార్ కొత్త సినిమా తొలి టికెట్ కొన్న మెగాస్టార్!
ప్రముఖ దర్శకుడు సుకుమార్ నిర్మాణంలో రూపొందిన చిత్రం 'దర్శకుడు'. అశోక్, ఈషా ప్రధాన పాత్రలుగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రానికి హరిప్రసాద్ జక్కా దర్శకత్వం వహించాడు. జూన్ 4వ తేదీన ఈ సినిమా రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో, 'దర్శకుడు' సినిమా తొలి టికెట్ ను మెగాస్టార్ చిరంజీవి కొనుగోలు చేశారు.
ఓ వైపు ఈ సినిమా నిర్మాణ బాధ్యతలను చూసుకుంటూనే, రామ్ చరణ్ హీరోగా 'రంగస్థలం' సినిమాను తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. ఈ సినిమాలో సమంత కథానాయికగా నటిస్తోంది.