: గంభీర్ కమ్యూనిటీ కిచెన్... ఆకలితో ఉన్నవారికి ఆదరణ!
భారత క్రికెటర్ గౌతమ్ గంభీర్ సేవా కార్యక్రమాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. ఇటీవల తన స్వచ్ఛంద సంస్థ గౌతమ్ గంభీర్ ఫౌండేషన్ తరఫున ఢిల్లీలోని పటేల్ నగర్‌లో `కమ్యూనిటీ కిచెన్` సేవ ప్రారంభించారు. దీని ద్వారా ప్రతిరోజు మధ్యాహ్నం 1 గం. నుంచి 3 గం. ల వరకు ఉచిత భోజన సదుపాయం కల్పించనున్నాడు. త్వరలో ఇలాంటి కమ్యూనిటీ కిచెన్‌లను ఢిల్లీ వ్యాప్తంగా నెలకొల్పుతానని గంభీర్ తెలిపాడు. పటేల్ నగర్ కమ్యూనిటీ కిచెన్ ప్రారంభ వేడుకలో ఆకలితో ఉన్న వారికి తానే స్వయంగా వడ్డించి దాతృ హృదయాన్ని చాటుకున్నాడు. తమ ఫౌండేషన్ సేవ కార్యక్రమాల గురించి గంభీర్ తన ట్విట్టర్ అకౌంట్‌లో తెలియజేశారు. `నా హృదయంలో జాలి, చేతిలో పళ్లెం, ఎవరూ ఆకలితో పడుకోకూడదని నా మనసులో ప్రార్థన` అంటూ ఆయన ట్వీట్ చేశారు.