: హైకింగ్ బార్ నిర్వాహకుడు బంటి సూసైడ్ లో కొత్త కోణం...ఆత్మహత్యకు కారణం టీఆర్ఎస్ నేత అనుచరులు!


హైదరాబాదులోని ఎల్బీనగర్ లో గల హైకింగ్ బార్ నిర్వాహకుడు బంటి సూసైడ్ ఘటనలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. వనస్థలిపురంలోని ఆయన నివాసంలో బంటి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మహత్యకు పాల్పడే ముందు ఆయన సెల్ఫీ వీడియో ఒకటి తీశారు. అందులో తన ఆత్మహత్యకు కారణం ఎల్బీనగర్ టీఆర్ఎస్ నేత, అతని అనుచరులని తెలిపారు. డబ్బులివ్వాలంటూ వారు తీవ్ర వేధింపులకు పాల్పడుతున్నారని ఆయన పేర్కొన్నారు.  దానికి తోడు తన వాటాదారులు (పార్ట్ నర్స్) కూడా సహకరించడం లేదని పేర్కొన్నారు. దీంతో అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

  • Loading...

More Telugu News