: ట్రైన్ ను గంటసేపు ఆపేసిన దుప్పటి!
ఒక దుప్పటి ట్రైన్ ను ఆపేసిన ఘటన చైనాలో చోటుచేసుకుంది. చైనాలోని చాంగ్వింగ్ పట్టణానికి ఒక ప్రత్యేకత ఉంది. పర్యాటకంలో ఆకట్టుకునే ఈ నగరంలో ఎత్తైన భవంతుల మీద రోడ్లు, 13 అంతస్తుల పైన పాదచారులు నడిచే రోడ్డు మార్గం, 19 అంతస్తుల పైన అపార్ట్ మెంట్ల మధ్య నుంచి వెళ్లే రైలు మార్గంతో ఆకట్టుకుంటుంది. అలాంటి ప్రత్యేకమైన నగరంలో 19 అంతస్తుల మీద ప్రయాణిస్తున్న రైలు అకస్మాత్తుగా ఆగిపోయింది. ట్రైన్ ఎందుకు ఆగిపోయిందో తెలియక ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.
అయితే ట్రైన్ ఆగిపోవడానికి కారణం ఒక దుప్పటి! అపార్ట్ మెంట్ పై నుంచి కిందపడిన ఒక దుప్పటి ట్రైన్ ట్రాక్ మీద పడింది. ట్రాక్ కు అడ్డంగా దుప్పటి ఉండడంతో ట్రైన్ ఆగిపోయింది. ట్రైన్ ఆపిన డ్రైవరే దానిని కర్రతో తీశాడు. అనంతరం రైలు తన ప్రయాణం కొనసాగించింది. దుప్పటి కారణంగా ట్రైన్ ఆగిపోయిందంటూ సోషల్ మీడియాలో ఆ వీడియో పోస్టు చేయడంతో వైరల్ అవుతోంది. దానిని మీరు కూడా చూడండి.