: భారత్ కు పాకిస్తాన్ కు మధ్య తేడా అదీ..!
పాకిస్తాన్ జైల్లో భారతీయ ఖైదీ సరబ్ జిత్ తోటి ఖైదీల దాడిలో గాయపడితే పాకిస్తాన్ ఎంత కటువుగా వ్యవహరించిందో తెలిసిందే. చికిత్స వేళ సరబ్ ను చూసేందుకు భారత దౌత్యాధికారులను అనుమతించకుండా కఠిన వైఖరి అవలంభించి తన నైజాన్ని బయటపెట్టుకుంది. కానీ, జమ్మూకాశ్మీర్లో పాకిస్తాన్ ఖైదీ సనావుల్లా తోటి ఖైదీల దాడిలో తీవ్రంగా గాయపడితే అతని ఆరోగ్య సమాచారం తెలుసుకునేందుకుగాను పాక్ దౌత్యాధికారులకు అనుమతినిచ్చి భారత్ తన సౌహార్ద స్వభావాన్ని చాటుకుంది. సనావుల్లా ఆరోగ్య స్థితిగతులు తెలుసుకోవాలనుకున్న పాక్ హైకమిషన్ అభ్యర్థనకు భారత్ వెంటనే ఓకే చెప్పేసింది. రెండు దేశాల ధోరణుల్లో ఎంత తేడా!