: నెల్లూరు బెట్టింగ్ కేసులో పోలీసు అధికారులపై తొలి వేటు!


నెల్లూరులో కలకలం రేపిన క్రికెట్ బెట్టింగ్ కేసులో తొలి వేటు పోలీసు అధికారులపై పడింది. బెట్టింగ్ దందాకు పోలీసులు సహకరిస్తున్నారని జిల్లా ఎస్పీ రామకృష్ణ ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వడంతో నెల్లూరు, గూడూరు డీఎస్పీలు వెంకటరాముడు, శ్రీనివాస్ లతో పాటు ముగ్గురు సీఐలపై డీజీపీ వేటు వేశారు. వారిని వీఆర్ కు అటాచ్ చేస్తున్నట్టు ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ కేసులో ఇప్పటికే 30 మందికి పైగా బుకీలు, పంటర్లను విచారించిన పోలీసులు, ఈ దందా వెనుక పలువురు ప్రజా ప్రతినిధులు కూడా ఉన్నట్టు నిర్థారించిన సంగతి తెలిసిందే. వైఎస్ఆర్ సీపీ మాత్రం, కేవలం తమపై కక్షతో కేసులు పెట్టాలని చూస్తున్నారని, తెలుగుదేశం పార్టీ నేతలను విచారించడం లేదని ఆరోపించింది.

  • Loading...

More Telugu News