: మరి పవన్ కల్యాణ్ ది ఏ జాతి?: ముద్రగడ భాషపై చంద్రబాబు అభ్యంతరం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ఉచ్చులో చిక్కుకోవద్దంటూ కాపు రిజర్వేషన్ ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం రాసిన బహిరంగ లేఖపై చంద్రబాబు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ లేఖలో ముద్రగడ ’మా జాతి’ అని పేర్కొనడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు కేబినెట్ సహచరుల వద్ద తన అభిప్రాయం వ్యక్తం చేస్తూ, ముద్రగడ చివరకు తన వాళ్లను కూడా వేరు చేసి మాట్లాడుతున్నారని అన్నారు.
'పవన్ కల్యాణ్ ది ఏ జాతి?' అని ఆయన ప్రశ్నించారు. ఆయన లేఖలో రాసిన భాష చూస్తే, ఆయన ఎవరి తరపున పనిచేస్తున్నారో తెలుస్తుందని ఆయన పేర్కొన్నారు. బెల్టు షాపులు మూసేయాలన్న నిర్ణయం చాలా వరకు అమలైందని చెప్పిన ఆయన, ఇంకా 500 లేదా 600 బెల్టు షాపులు మాత్రమే మిగిలాయని, మరో 48 గంటల్లో వాటిని కూడా మూసేయించాలని ఆయన ఆదేశించారు. పూర్తి వివరాలు వచ్చిన తరువాత నిరుద్యోగ భృతి గురించి నిర్ణయం తీసుకుందామని ఆయన తెలిపారు.