: విశాఖ జిల్లాలో ఆర్టీసీ బస్సులో పేలుడు!


ఆర్టీసీ బస్సులో పేలుడు సంభవించిన సంఘటన విశాఖ జిల్లాలో చోటు చేసుకుంది. అరకు లోయ నుంచి శృంగవరపుకోటకు వెళ్తున్న ఆర్డినరీ బస్సులో ఈ రోజు రాత్రి 7.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అనంతగిరి మండలం డముకు గ్రామ సమీపంలోని పర్యాటక శాఖ వ్యూపాయింట్‌ దగ్గరకు బస్సు చేరుకున్న సమయంలో.. ఒక్కసారిగా, బస్సు వెనుక భాగంలో పెద్ద శబ్దం వచ్చి దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. దీంతో, బస్సును డ్రైవర్ నిలిపివేశాడు. బస్సు వెనుక భాగం ధ్వంసమై ఉండడంతో పాటు చిన్న ఇనుప వస్తువులు, అధిక సంఖ్యలో పాలిథిన్‌ సంచులు కాలి ఉండడాన్ని డ్రైవర్ గమనించాడు. ఈ మేరకు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 

  • Loading...

More Telugu News