: ‘అన్నదాత సుఖీభవ’ అంటున్న ఆర్.నారాయణమూర్తి


‘హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య’ సినిమా తర్వాత నటుడు ఆర్.నారాయణమూర్తి నటించనున్న చిత్రం ‘అన్నదాత సుఖీభవ’. నారాయణమూర్తి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం గురించిన విశేషాలను ఆయన వెల్లడించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ నెల 4 నుంచి పశ్చిమగోదావరి జిల్లాలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని చెప్పారు. రైతు లేనిదే రాజ్యం లేదని చెప్పిన నారాయణమూర్తి, గిట్టుబాటు ధరలు లేకపోవడం వల్లే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. ఈ అంశాన్నే ఇతివృత్తంగా తీసుకుని 'అన్నదాత సుఖీభవ' చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు చెప్పారు. 

  • Loading...

More Telugu News