: తుని మాజీ ఎమ్మెల్యే బ్యాంక్ అకౌంట్ హ్యాక్!


తూర్పు గోదావరి జిల్లా తుని మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు బ్యాంకు ఖాతాలో నుంచి నగదు మాయం అయింది. సుమారు రూ. 3 లక్షలు వరకు ఆయన ఖాతా నుంచి ఎవరో డ్రా చేసుకున్న విషయం తెలుసుకున్న ఆయన కంగుతిన్నారు. తన ఖాతాలో నగదు తీసుకునేందుకు బ్యాంక్ కు వెళ్లిన ఆయన ఈ విషయం తెలిసి ఆశ్చర్చపోయారు. ఈ నేపథ్యంలో తుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబర్ దొంగలు ఈ మోసాలకు పాల్పడి ఉంటారని ఆయన తన ఫిర్యాదులో అనుమానం వ్యక్తం చేశారు. కాగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు అకౌంట్ ఎలా హ్యాక్ అయిందనే విషయమై ఆరా తీస్తున్నారు.

  • Loading...

More Telugu News