: ఎవరిని పడితే వారిని బీసీల్లో చేర్చడానికి ఇదేమైనా ధర్మసత్రమా?: ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య
కాపులను బీసీలలో కలపడం చట్ట విరుద్ధమని, ఎవర్ని పడితే వారిని బీసీల్లో చేర్చడానికి ఇదేమైనా ధర్మసత్రమా? అని టీడీపీ ఎమ్మెల్యే, బీసీ నేత ఆర్. కృష్ణయ్య ప్రశ్నించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తాను తెలంగాణలో బీసీ సీఎం అభ్యర్థిగా పోటీ చేశానని, ఏపీ టీడీపీ మేనిఫెస్టోను వ్యతిరేకించానని నాటి విషయాలను ప్రస్తావించిన కృష్ణయ్య, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ దీనిపై ఆలోచించాలని కోరారు. పేదలు అన్ని కులాల్లో ఉంటారని, పేదరికం ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండవని అన్నారు.