: ‘సాక్షి’ దళిత వ్యతిరేక పత్రిక: జూపూడి ప్రభాకర్
‘సాక్షి’ దళిత వ్యతిరేక పత్రిక అని ఏపీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ ఆరోపించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అభివృద్ధిని చూసి ఓర్వలేకే సాక్షి పత్రికలో తప్పుడు వార్తలు ప్రచురిస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీ కార్పొరేషన్ రద్దు అన్న వార్తను తెలుగుదేశం పార్టీని అభాసుపాలు చేయడానికే ఆ పత్రికలో ప్రచురించారని, దళితుల అభివృద్ధి, సంక్షేమానికి సీఎం పెద్దపీట వేస్తున్నారని, గతంలో కాంగ్రెస్ ఎస్సీ కార్పొరేషన్ ను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు.