sruthihassan: శ్రుతి హాసన్ బ్యాడ్ లక్ .. సినిమా ఆగిపోయింది!


మొదటి నుంచి కూడా శ్రుతిహాసన్ హిందీ సినిమాలపైనే దృష్టి పెడుతూ వచ్చింది. వీలును బట్టి తెలుగు .. తమిళ సినిమాలను అంగీకరిస్తోంది. ఈ కారణంగా తెలుగు .. తమిళ భాషల్లో ఆమె చేసే సినిమాల సంఖ్య తగ్గుతూ వస్తోంది గానీ, హిందీ సినిమాల వలన కలిసొచ్చినదైతే ఏమీ లేదనే చెప్పాలి. ఇటీవల వచ్చిన 'బెహన్ హోగీ తెరి' సినిమా కూడా ఆమెకు నిరాశనే మిగిల్చింది.

 ఇక తాజాగా చేస్తున్న సినిమా ఆగిపోవడం ఆమెకి మరింత నిరుత్సాహాన్ని కలిగించే విషయం. ప్రస్తుతం ఆమె విద్యుత్ జమ్వాల్ సరసన 'యారా' సినిమా చేస్తోంది. కొంత భాగం షూటింగ్ జరిగాక .. ఈ ప్రాజెక్టును ఆపేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమాను కొనడానికి ఎవరూ ముందుకు రాకపోవడమే అందుకు కారణమని చెప్పుకుంటున్నారు. బహుభాషా చిత్రం 'సంఘమిత్ర' నుంచి తప్పుకోవాల్సి రావడం, ఇప్పుడిలా ఈ హిందీ సినిమా ఆగిపోవడం ఆమెతో పాటు అభిమానులను బాధించే విషయమే.      

  • Loading...

More Telugu News