: పార్టీల పొత్తు అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగేది కాదు!: పురందేశ్వరి


ఏపీలో ఒకప్పుడు బీజేపీకి పద్నాలుగు, పదిహేను శాతం ఓట్లు ఉండేవని, ఇటీవల అది రెండు శాతానికి వచ్చిందని  బీజేపీ సీనియర్ మహిళా నేత పురందేశ్వరి అన్నారు. ప్రకాశం జిల్లా కారంచేడులో మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ పొత్తు వ్యవహారం గురించి ప్రశ్నించగా, పొత్తు అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగేది కాదని, రెండు పార్టీల మధ్య జరిగేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తుపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నిర్ణయం తీసుకుంటారని అన్నారు.

ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు గురించి ప్రస్తావిస్తూ, క్రియాశీలక రాజకీయాల గురించి ఆయన తప్పుకోవడం ఏపీలో బీజేపీకి కొంత నష్టమేనని భావిస్తున్నానని అభిప్రాయపడ్డారు. వెంకయ్యనాయుడుకి ఉపరాష్ట్రపతి పదవి దక్కడం తెలుగువారు గర్వించదగ్గ విషయమని అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యపై జనసేన పార్టీ అధినేత పవన్ చొరవ అభినందనీయమని ప్రశంసించారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పాదయాత్రకు అనుమతి నిరాకరించడం సబబుకాదని, వ్యక్తి స్వేచ్ఛ, హక్కులను హరించడం సరికాదని పురందేశ్వరి విమర్శించారు.

  • Loading...

More Telugu News