: ఈ-ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించిన చంద్రబాబు.. ఫలితాలు వేగంగా వస్తాయన్న లోకేశ్


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు ఈ-ప్రగతి శిక్షణను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2017-18ని ఈ-ప్రగతి సంవత్సరంగా గుర్తించామని చెప్పారు. మెరుగైన పనితీరును చూపించడానికి టెక్నాలజీ ఉపయోగపడుతుందని అన్నారు. టెక్నాలజీ వినియోగం ఖర్చుతో కూడుకున్నదనే వాదన సరైనది కాదని... టెక్నాలజీతో డబ్బు ఆదా అవుతుందని చెప్పారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రులు నారా లోకేశ్, కామినేని శ్రీనివాస్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఆరు నెలల ఈ-ప్రగతి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించడం సంతోషదాయకమని చెప్పారు. ఈ కార్యక్రమం వల్ల ఉద్యోగుల్లో కొత్త టెక్నాలజీ, సాఫ్ట్ వేర్ పట్ల అవగాహన పెరుగుతుందని... వారిలో పనితీరు మెరుగుపడుతుందని, ఫలితాలు వేగంగా వస్తాయని అన్నారు. 

  • Loading...

More Telugu News