: నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీనామా.. మళ్లీ యూనివర్శిటీలో పాఠాలు చెప్పుకుంటానంటున్న అరవింద్ పనగారియా!
నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా తన పదవికి ఈరోజు రాజీనామా చేశారు. ఈ నెలాఖరు వరకు నేషనల్ ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ట్రాన్స్ ఫార్మింగ్ ఇండియా (ఎన్ఐటీఐ)కు ఆయన తన సేవలను అందించనున్నారు. ఈ సందర్భంగా అరవింద్ పనగారియా మాట్లాడుతూ, అమెరికాలోని కొలంబియా యూనివర్శిటీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్ గా తిరిగి తన జీవితాన్ని ప్రారంభిస్తానని, ఇన్నాళ్లు తను సెలవులో వున్నానని, సెప్టెంబర్ 5తో తన సెలవు పూర్తవుతుందని, అదే రోజు నుంచి విద్యార్థులకు పాఠాలు చెబుతానని అన్నారు. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్రమోదీకి చెప్పానని ఆయన చెప్పారు. కాగా, 2015, జనవరి 5న నీతి అయోగ్ వైస్ చైర్మన్ గా ఆయన బాధ్యతలు చేపట్టారు.