: గతంలో ఏ ఇండియన్ టీమ్ చేయలేనిది ఇప్పుడు కోహ్లీ సేన చేస్తుంది: రవిశాస్త్రి
కోహ్లీ సేనపై టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి ప్రశంసలు కురిపించారు. గతంలో ఏ ఇండియన్ టీమ్ సాధించలేనివి కోహ్లీ సేన సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. గత రెండు దశాబ్దాల కాలంలో భారత్ తరపున ఎంతో మంది దిగ్గజాలు ఆడారని.. కానీ, శ్రీలంకలో టెస్ట్ సిరీస్ ను మాత్రం గెలుచుకోలేక పోయారని గుర్తు చేశాడు. గత 22 ఏళ్ల కాలంలో 2015లో మాత్రమే ఇది సాధ్యమైందని... శ్రీలంక టూర్ కు వెళ్లిన కుర్రాళ్లు సిరీస్ ను కైవసం చేసుకున్నారని చెప్పాడు. గతంలో భారత దిగ్గజాలు చేయలేని పనిని ఇప్పుడు కోహ్లీ సేన మరోసారి చేస్తుందనే ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తపరిచాడు.