: అసలు విషయం తెలుసుకోకుండా ట్రంప్ ను విమర్శించినందుకు క్షమాపణలు: ‘హ్యారీ పోటర్’ రచయిత్రి రోలింగ్
వారం రోజుల క్రితం వైట్ హౌస్ లో జరిగిన ఓ కార్యక్రమంలో యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ తో కరచాలనం చేసేందుకు ఓ దివ్యాంగ బాలుడు ఆసక్తి చూపగా, అతన్ని పట్టించుకోకుండా ట్రంప్ వెళ్లిపోయారనే ఫేక్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. అయితే, ఆ వీడియోను చూసిన హ్యారీ పోటర్ పుస్తక రచయిత్రి జె.కె. రోలింగ్, ట్రంప్ పై విమర్శలు గుప్పించారు. ఆ దివ్యాంగ బాలుడిని పట్టించుకోకుండా ట్రంప్ వెళ్లిపోవడం దారుణమంటూ విమర్శించారు. అయితే, ఆ వీడియో ఫేక్ అని, ఎడిట్ చేశారనే విషయం తెలుసుకున్న రోలింగ్ తన ట్విట్టర్ వేదికగా ట్రంప్ కు క్షమాపణలు చెప్పారు. అసలు, విషయం తెలుసుకోకుండా ట్రంప్ ను విమర్శించడం పొరపాటైందని పేర్కొన్న రోలింగ్, ఎడిట్ అయిన వీడియోను కూడా పోస్ట్ చేశారు.