: ఇప్పట్లో అసెంబ్లీ సీట్ల పెంపు లేదు: పార్లమెంటులో సమాధానమిచ్చిన కేంద్ర మంత్రి హన్స్ రామ్
తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు ఇప్పట్లో లేదని కేంద్రం తేల్చి చెప్పింది. తెలుగుదేశం ఎంపీ మురళీమోహన్, టీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిలు అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి హన్స్ రామ్ సమాధానం ఇస్తూ, 2019లోగా అసెంబ్లీ సీట్లను పెంచాలంటే, రాజ్యాంగంలోని ఆర్టికల్ 170(3)ని సవరించడం ఒక్కటే మార్గమని, అది కుదరదని వెల్లడించారు. 2026లో అప్పటి జనాభా లెక్కల ఆధారంగానే అన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పునర్వ్యవస్థీకరణ ఉంటుందే తప్ప, ఈలోగా నియోజకవర్గాల పెంపు ఉండదని వెల్లడించారు. దీంతో ఈ విషయంలో మరింత స్పష్టత వచ్చినట్లయింది.