: గీతామాధురి భర్త నందు విచారణ పూర్తి...సిట్ విచారణ సమాప్తం!


ప్రముఖ సినీ యువ నటుడు నందు అలియాస్ ఆనందకృష్ణ సిట్ విచారణ పూర్తైంది. హైదరాబాదులో వెలుగు చూసిన డ్రగ్ దందాపై పూర్తి సమాచారం సేకరించడంలో భాగంగా నందును సిట్ అధికారులు విచారించారు. కెల్విన్ ఫోన్ డాటాలో నందు ఫోన్ నెంబర్ ఉండడంతో ఆ దిశగా సిట్ అధికారులు ప్రశ్నలు సంధించారు. నందు ఎంత స్వేచ్ఛగా విచారణకు వచ్చాడో, అంతే స్వేచ్ఛగా విచారణ నుంచి వెళ్లిపోయాడు. విచారణకు ముందు, తరువాత ఎలాంటి ఒత్తిడికి గురికాకపోవడం విశేషం.

తనకు ఎలాంటి దురలవాట్లు లేవని నందు స్పష్టంగా చెప్పిన సంగతి తెలిసిందే. అదే విషయాన్ని సిట్ అధికారులకు కూడా చెప్పాడు. నందు విచారణ కేవలం 3 గంటలపాటే సాగింది. సిట్ విచారణ ఎదుర్కొన్న వారిలో నందు మాత్రమే అత్యంత తక్కువ సమయం విచారణ ఎదర్కొన్న వ్యక్తిగా నిలిచారు. దీంతో సిట్ నోటీసులు జారీ చేసిన 12 మంది సినీ నటుల విచారణ పూర్తైంది. విచారణలో సేకరించిన వివరాలతో సిట్ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేయనుంది. కెల్విన్, జిషాన్ తదితర డ్రగ్ సరఫరాదారుల కేసులో సిట్ విచారణ ఛార్జిషీటు కోసం సినీ నటులతో పాటు 27 మందిని విచారించినట్టు తెలుస్తోంది. 

  • Loading...

More Telugu News