: ఆడుతున్నది టెస్ట్ అయినా.. నాకు వన్డేలానే అనిపించింది: పాండ్యా
లిమిటెడ్ ఓవర్ల క్రికెట్లో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో టెస్ట్ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో ఎనిమిదో నెంబర్లో బరిలోకి దిగిన పాండ్యా... 49 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. భారత క్రికెట్లో తనదైన ముద్ర వేసిన పాండ్యా... తన ఆరాధ్య క్రికెటర్ ఇండియన్ కాదని చెప్పాడు. దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ కలీస్ అంటే తనకు ఎంతో ఇష్టమని అన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ లలో సత్తా చాటి సౌతాఫ్రికాకు ఎన్నో విజయాలను కలీస్ అందించాడని ప్రశంసించాడు. ముమ్మాటికీ తన ఆరాధ్య క్రికెటర్ కలీసే అని చెప్పాడు. మరోవైపు తొలి టెస్టులో తన ఆటతీరు గురించి మాట్లాడుతూ, ఆడుతున్నది టెస్ట్ మ్యాచ్ అయినా తనకు వన్డేలానే అనిపించిందని అన్నాడు. అప్పటి పరిస్థితులు కూడా అనుకూలంగా ఉన్నాయని, దీంతో తాను వేగంగా ఆడగలిగానని చెప్పాడు.