: వాయు దేవుడి ఉగ్రరూపం...అమాంతం గాల్లో లేచిన కారు... వీడియో చూడండి!
అమెరికాలోని న్యూయార్క్ లో వాయుదేవుడు ఉగ్రరూపం చూపించాడు. ఆ ఉగ్రరూపానికి న్యూయార్క్ చిగురుటాకులా వణికిపోయింది. 150 కిలోమీటర్ల వేగంతో టోర్నోడో సృష్టించిన బీభత్సానికి న్యూయార్క్ లోని భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు, తీగలు నేలకొరిగాయి. వాహనాలు గాల్లోకి ఎగిరి అల్లంత దూరంలో పడ్డాయి. ఈ క్రమంలో హంబర్గ్ లో ఇంటిముందు పార్క్ చేసిన ఎస్యూవీ కారు గాల్లోకి అమాంతం లేచి అడ్డం తిరిగిన ఘటన సీసీ కెమెరాలో నిక్షిప్తమైంది. దీనిని సోషల్ మీడియాలో పోస్టు చేయగా, వైరల్ అవుతోంది. ఈ వీడియోను 26 లక్షల మంది వీక్షించడం విశేషం. మీరు కూడా ఆ వీడియోను చూడండి.