: ఐఫోన్ 8లో వినూత్న ఫీచర్ ఇదే... పొరపాటున బయటపెట్టి నాలిక్కరుచుకున్న యాపిల్!


ఈ సంవత్సరం చివరిలోగా ప్రపంచ మార్కెట్ ను తాకే యాపిల్ సరికొత్త ఐఫోన్ 8లో ఉండే వినూత్న ఫీచర్ వివరాలను పొరపాటున ఆ సంస్థ బయట పెట్టింది. ఈ ఫోన్ కు ప్రత్యేక ఆకర్షణగా ఫేస్ అన్ లాక్ ఫీచర్ ఉంటుందని, కస్టమర్లు తమ కెమెరావైపు చూస్తే ఫోన్ అన్ లాక్ అవుతుందని తెలుస్తోంది. బయోమెట్రిక్ కిట్ విధానంతో ఇది పని చేస్తుందని యాపిల్ నుంచి స్వయంగా లీకులు అందాయని 'ది కోడ్ బేస్' పేర్కొంది.

ఇన్ ఫ్రారెడ్ కెమెరాను ఇందులో వాడారని, ఇది చీకట్లో కూడా తన యజమానిని గుర్తిస్తుందని తెలిపింది. దీంతో పాటు యాపిల్ పాత వర్షన్ ఫోన్లలోని అన్ని ప్రముఖ ఫీచర్లూ ఉంటాయని తెలుస్తోంది. ఈ ఫోన్ లో కూడా టచ్ ఐడీ బటన్ ఉండదు. కాగా, ఫేస్ అన్ లాకింగ్ ఫీచర్ తో ఈ ఫోన్ లభిస్తే, ఇటువంటి ఫీచర్ తో వచ్చిన తొలి ఫోన్ ఇదే కానుంది. కాగా, శాంసంగ్, ఎసెన్షియల్ తదితర కంపెనీలు సైతం ఇదే తరహా అన్ లాకింగ్ విధానాన్ని అభివృద్ధి చేస్తున్నామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక తమ నుంచే ఈ లీక్ ఎలా వెళ్లిందన్న విషయం యాపిల్ యాజమాన్యానికి కూడా అంతుచిక్కడం లేదని సమాచారం.

  • Loading...

More Telugu News