: ఆంధ్రజ్యోతిపై పరువునష్టం కేసులో వాంగ్మూలమిచ్చిన వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి
ఆంధ్రజ్యోతి దినపత్రికపై వేసిన పరువునష్టం కేసులో వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వాంగ్మూలాన్ని ఈ రోజు నాంపల్లి కోర్టు నమోదు చేసింది. తమ అధినేత జగన్ పరువుకు భంగం కలిగించేలా ఆంధ్రజ్యోతి తప్పుడు కథనాలను ప్రచురించిందంటూ ఆర్కే 17వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టులో ఫిర్యాదు చేశారు. ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ, పబ్లిషర్ వెంకట శేషగిరిరావు, ఎడిటర్ శ్రీనివాస్, మరికొందరు ఉద్యోగులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తన పిటిషన్ లో ఆయన కోరారు. ఈ నేపథ్యంలో పిటిషన్ ను విచారించిన కోర్టు తొలుత ఆర్కే వాంగ్మూలాన్ని నమోదు చేయాలని ఆదేశించింది. దీంతో, ఈ రోజు ఆయన వాంగ్మూలాన్ని రికార్డు చేశారు.