: తండ్రి ముఖేష్ గౌడ్ ను బెదిరించేందుకే ఈ హై డ్రామా: విచారణలో విక్రమ్ గౌడ్
తనపై కాల్పులు జరిగితే, దాన్ని హత్యాయత్నంగా చూపించి, తాను తీర్చాల్సిన అప్పులకు సంబంధించిన డబ్బును తండ్రి ముఖేష్ గౌడ్ నుంచి తీసుకోవచ్చన్న ఆలోచనతో విక్రమ్ గౌడ్ స్వయంగా కాల్పుల డ్రామాకు తెరలేపాడని పోలీసులు తేల్చారు. కేసు విచారణ దాదాపు ముగిసిందని, తండ్రిని బెదిరించాలన్నదే విక్రమ్ అసలు ఆలోచనని పోలీసు వర్గాలు వెల్లడించాయి.
తొలుత బహిరంగ ప్రదేశంలో ఈ ప్లాన్ అమలు చేయాలని విక్రమ్ భావించాడని, అలా చేస్తే దొరికిపోయే ప్రమాదం ఉందని ఆలోచించి, ఇంట్లోనే నాటకానికి తెర లేపాడని కూడా పోలీసులు గుర్తించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విక్రమ్ ను ఇంటరాగేట్ చేయగా, మొత్తం వ్యవహారం ఆయన నోటి నుంచే బయటకు వచ్చిందని అన్నారు. తనంటే ఎంతో ప్రేమ చూపించే తండ్రి నుంచి బకాయిలు తీర్చేందుకు అవసరమైన డబ్బును తీసుకోవాలన్న ఆలోచనతో ఇదంతా చేసినట్టు విక్రమ్ వెల్లడించాడని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.