: ఆసియా ధనవంతుల జాబితాలో రెండో స్థానంలో ముకేష్ అంబానీ!
గతంలో ఆసియా ధనవంతుల జాబితాలో రెండో స్థానంలో ఉన్న లీ కా షింగ్‌ను దాటేసి ఆ స్థానంలోకి ముకేష్ అంబానీ చేరుకున్నారు. ఆయన ఈ స్థానానికి రావడానికి జియో అమ్మకాలే కారణమని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బ్లూమ్స్‌బర్గ్ బిలియనీర్ నివేదిక ప్రకారం ఈ ఏడాది ముకేష్ అంబానీ రూ. 77000 కోట్ల ఆదాయం ఆర్జించారు. త్వరలో రిలయన్స్ వారు విడుదల చేయనున్న ఫీచర్ ఫోన్ వల్ల వచ్చే ఏడాది వారి ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందని బ్లూమ్స్‌బర్గ్ అభిప్రాయపడుతోంది. ఈ జాబితాలో మొదటి స్థానంలో చైనాకు చెందిన అలీబాబా ఈ-కామర్స్ వెబ్‌సైట్ స్థాపకుడు జాక్ మా ఉండగా, మూడో స్థానంలో హాంగ్ కాంగ్‌కు చెందిన పారిశ్రామిక వేత్త లీ కా షింగ్ ఉన్నారు.